శివ లింగాన్ని పూజించేటప్పుడు దిశ ముఖ్యమా...నియామాలు ఏమిటంటే..!

 

శివ లింగాన్ని పూజించేటప్పుడు దిశ ముఖ్యమా...నియామాలు ఏమిటంటే..!


శివారాధన శివ భక్తులకు ప్రత్యేకమైనది.  శివుడిని అందరూ ఆరాధించినా సరే.. శివ భక్తులకు ఇది మరింత ప్రత్యేకం.  అయితే శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం  చాలా ముఖ్యం. హిందూ గ్రంథాల ప్రకారం, శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని పేర్కొన్నారు. ఇది పూజ వల్ల లభించే ఫలితాన్ని పెంచుతుందని చెబుతారు.

శివలింగాన్ని పూజించడంలో దిశకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివలింగాన్ని పూజించడానికి సరైన దిశ గురించి
శివ పురాణంతో పాటు  ఇతర గ్రంథాలలో కూడా వివరణ ఉంది. కేవలం దిశ మాత్రమే కాదు, పూజ దిశ గురించి కూడా  వివరణాత్మక సమాచారం ఇవ్వబడింది. ఈ గ్రంథాల ప్రకారం శివలింగాన్ని పూజించేటప్పుడు, ఉత్తరం వైపు తిరిగి పూజించడం ఉత్తమమని భావిస్తారు.  భక్తుడు తూర్పు దిశకు ముఖంగా పూజిస్తే, అతను శివలింగం యొక్క ప్రధాన భాగాన్ని అడ్డుకుంటాడు, ఇది పూజ ఫలాలను తగ్గిస్తుందట.

ఎవరైనా ఉత్తరం వైపు ముఖం పెట్టి పూజలు చేసినప్పుడు,  వారు శివుని ఎడమ వైపున ఉంటారట. ఇది  పార్వతిదేవి స్థలంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ స్థితిలో శివుడిని  పూజించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. శివుడు,  శక్తిని ఒకే రూపంలో పూజించాలని శాస్త్రాలలో చెప్పబడింది.  అప్పుడే అది ఫలవంతమవుతుంది.

ఉత్తమ స్థానం ఏమిటంటే.. భక్తుడు దక్షిణం వైపుకు ముఖంగా కూర్చుని ఉత్తరం వైపుకు ముఖంగా పూజ చేయాలట. ఈ స్థితిలో భక్తుడు శివలింగం ముందు ఉంటాడు. ఇలా చేసే   పూజ దోషరహితంగా పరిగణించబడుతుంది.

ఉత్తర దిశ ప్రాముఖ్యత..

మత విశ్వాసాల ప్రకారం ఉత్తర దిశను దేవతలు,  ఋషులు లక్ష్యంగా భావిస్తారు. దక్షిణ దిశను పూర్వీకుల దిశగా భావిస్తారు. తూర్పును దేవతల దిశగా భావిస్తారు.  పశ్చిమాన్ని మానవుల దిశగా భావిస్తారు. ఉత్తర దిశ  ప్రత్యేకత స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. అందుకే శివలింగం పూజ చేసేటప్పుడు ఉత్తర దిశలో ఉండి పూజ చేయాలి.

                              *రూపశ్రీ.