Read more!

ధనమే ఆధారం (Money makes many things)

 

ధనమే ఆధారం

(Money makes many things)


యస్యాస్తి విత్తంసనరః కులలీన స్సపండితః సశ్రుతవాన్ గుణజ్ఞః

సే ఎవ వక్తా స చదర్శనీయః సర్వే గుణాః కాంచన మాశ్రయంతి

 

ఏ కులంలో పుట్టారు అన్నది ప్రదానం కాదు. ఎంత ధనవంతుడు అన్నదే ముఖ్యం. ధనం ఉంటే యజమాని అవుతాడు. పండితుడు, శాస్త్రం తెలిసిన వాడు, గొప్ప వక్త లాంటి కితాబులెన్నో పొందుతాడు. గుణవంతుడు అనే కీర్తిని సొంతం చేసుకుంటాడు. దీని భావం ఏమిటంటే ధనం గనుక ఉంటే ఇతర సుగుణాలు ఏమీ లేకపోయినా ప్రశంసలు వస్తాయి. ఒక్క డబ్బు గనుక లేకుంటే, తక్కినవి ఏమున్నా నిరర్ధకం అవుతుంది. లోకం డబ్బు చుట్టూ తిరుగుతోంది అని చెప్పడం అన్నమాట.