Read more!

పుష్కరాల సమయంలో చేయవలసిన దానములు

 

 

పుష్కరాల సమయంలో చేయవలసిన దానములు

 


 

మొదటి రోజు దానము బంగారము, వెండి, ధాన్యము, భూమి.
ఫలితము మహారాజ యోగం.
రెండో రోజు దానము వస్త్రాలు, గోవులు, ఉప్పు, రత్నాలు.
ఫలితము   వసులోక ప్రాప్తి.
మూడో రోజు దానము బెల్లము, పండ్లు, గుర్రాలు.
ఫలితము    గంధర్వలోక ప్రాప్తి.
నాలుగో రోజు దానము నెయ్యి, నూనె, పాలు, తేనె.
ఫలితము   పుణ్యలోక ప్రాప్తి.
ఐదో రోజు దానము ధాన్యము, రథము, ఎద్దు, నాగలి.
ఫలితము  అష్టైశ్వర్య, ఆరోగ్య సిద్ధి.
ఆరో రోజు  దానము     ఔషధములు, గంధము, కర్పూరము, కస్తూరి.
ఫలితము     చంద్రలోక ప్రాప్తి.
ఏడో రోజు దానము  గృహము, పీఠము, పల్లకి, శయ్య.
ఫలితము     రాజ యోగము.
ఎనిమిదోరోజు దానము కందమూలాలు, పూలు, చందనము.
ఫలితము ఇంద్రలోక ప్రాప్తి.
తొమ్మిదోరోజు దానము పిండప్రదానం, దాసి, కన్య, కంబళి.
ఫలితము సంతాన సిద్ధి, సూర్యలోక ప్రాప్తి.
పదో రోజు దానము ముత్యాలు, పూలు, వెండి
ఫలితము సమస్త భూమినీ దానం చేసినంత ఫలితం.
పదకొండవరోజు  దానము పుస్తకాలు, యజ్ఞోపవీతము, తాంబూలము
ఫలితము స్వర్గలోక ప్రాప్తి.
పన్నెండవరోజు  దానము గో, సువర్ణ, తిల, అశ్వ... వంటి షోడశ దానాలు. సమారాధన.
ఫలితము అనంతకోటి పుణ్యఫలితం.