Read more!

మార్గశిర అష్టమి కాళభైరవాష్టమి

 

మార్గశిర అష్టమి కాళభైరవాష్టమి

 

 

 

"కాళభైరవా నమోస్తుతే - కపిలీశ్వరా నమోస్తుతే - కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే"
అని నిత్యం పఠిస్తే బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కాళభైరవుడు.
మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి ''కాలభైరవాష్టమి''. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ''కాలభైరవాష్టమి'' పర్వదినాన్న కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి  శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.  ఈరోజు గంగాస్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

 

 

 


కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవునికి ….. ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి, భైరవుని తలచుకుంటూ, దేవుని ముందు ... 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించి పెట్టండి. ఎంతో మంచిది. భైరవుడు ఎంతో సంతోసిస్తాడు. దీవిస్తాడు.