నవమినాడు త్రివిక్రమ, త్రిరాత్ర వ్రతం

 

నవమినాడు త్రివిక్రమ, త్రిరాత్ర వ్రతం

 

 

 

వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం.

 

 

 


దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధానికి సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తి బలి స్వర్గంపై అధికారము సంపాధిస్తాడు.

 

 

 


ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమనే చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్తాడు. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతాన్ని ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపంలో ప్రవేశించాడు.

 

 

 


ఒక పాదంలో భూమిని కప్పి, దేవ లోకాన్ని రెండవ పాదంతో నిరోధించి, జగాలన్నీ దాటిన త్రివిక్రముడు మరల వామనుడై బలిని చూస్తూ నా మూడవ పాదానికి స్థలము చూపించమన్నాడు. అప్పుడు బలి వినయంతో నీ తృతీయ పాదాన్ని నా శిరస్సుపై ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకానికి పంపి, తానే ఆ లోకానికి ద్వారపాలకుడు కుడా అయ్యాడు. బలిని అడిగి సంపాదించిన లోకాలను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి.

 

 

 


    ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన
    పదనఖ నీరజ నతజన పావన
    కేశవ ధృత వామన రూప జయ జగదీశహరే
-- జయదేవుని దశావతార స్తోత్రము
ఈ వామనావతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.