Read more!

సప్తమి నాడు సూర్యారాధన, నారాయణుడిని పూజిస్తారు

 

సప్తమి నాడు సూర్యారాధన, నారాయణుడిని

 

పూజిస్తారు

 

 

 

 

మార్గశిర మాసంలో అంశుమంతుడనే సూర్యుడు తన రధం లో సంచరిస్తూ ఉంటాడు. కశ్యపమహర్షి, ఊర్వశి అనే అప్సరస, రుతసేనుడనే గంధర్వుడు, మహాశంఖమనే సర్పం, తారక్ష్యుడు అనే యక్షుడు, విద్యుచ్చత్రువు అనే రాక్షసుడు, ఆయన వెంట ఉంటారు. ఆయన చీకట్లను పారద్రోలడంలో, శత్రువులను సంహరించడంలో సమర్ధుడు, సకల జగత్తుకు శుభప్రదుడు. మునీశ్వరులు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. అటువంటి అంశుమంతుడు అనే ఈ ఆదిత్యుడు తొమ్మిదివేల కిరణాలతో శోభిల్లుతూ ఆకుపచ్చ వర్ణంతో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఒక సారి వైశంపాయనుడు వ్యాసమహర్షిని ఈ విధంగా అడిగాడు ... ఓ మహర్షి! ప్రతిరోజు ఆకాశంలో ఉదయించే ఆ తేజశ్శాలి ఎవరు? దేవతలు, మహర్షులు సిద్ధులు, మానవులంతా ఆ మహాపురుషుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పండి ... అని అడుగగా ఈ విధంగా వివరించారు.

 

 

 


" ఓ వైశంపాయనా ! యితడు బ్రహ్మ స్వరూపం నుండి ఉద్భవించాడు. ఉత్కృష్టమైన బ్రహం తేజోరూపుడు. సాక్షాత్ బ్రహ్మమయుడే. ఈ భగవానుడు ధర్మ, అర్ధ, కామ, మోక్షము అనే నాలుగు పురుషార్ధ ఫలాలని ఇస్తాడు. ఇదే సూర్యుని యొక్క సత్యమయ స్వరూపము. లోకముల యొక్క ఉత్పత్తి, పాలన ఈయన వల్లే జరుగుతాయి. ఈయన లోకరక్షకుడు. ద్విజులు మొదలైనవారు ఈ మహాత్ముని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు. సంద్యోపాసన సమయంలో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు తమ భుజాలను పైకెత్తి ఈ దివ్యపురుషున్నే సేవిస్తారు. ఈయన్ని ఆరాదిస్తే సమస్త దేవతలను ఆరాదించినట్లే. సూర్యమండలంలో ఉన్న సాధ్యదేవిని ఉపాశించి ద్విజులంతా స్వర్గాన్ని, మోక్షాన్ని పొందుతున్నారు. సుర్యోపాసన వల్లే మనుష్యులు రోగాలనుంచి విముక్తులవుతున్నారు. ఈ స్వామిని పుజించేవారికి ఎన్నడు అంధత్వము దారిద్రియము, దు:ఖము, శోకాలు కలుగవు అని తెలియజేశారు  వ్యాసమహర్షి .

 

 

 


ప్రాతః కాలంలో విధి విధానంగా స్నానం చేస్తే పుణ్యలోక ప్రాప్తి క‌లుగుతుంది. సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపాలను పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలంలో సూర్యకిరణాలతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహంలో స్నానమాచరించిన వారు పితృ, మాతృ వంశాలకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి, తరువాత అమర దేహుడై స్వర్గానికి వెళతాడు. అరుణోదయం కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. సూర్యోద‌యానికి ముందే స్నానం చేస్తే ఉత్తమం. సూర్యోద‌య స‌మ‌యంలో స్నానం మ‌ద్యమం. సూర్యోద‌యం త‌ర్వాత స్నానం చేస్తే త‌క్కువ ఫ‌లితం ఉంటుంది. ఆదివారం నాడు సూర్య భ‌గ‌వానుడ్ని త‌ప్పక అర్చించాలి. ఆ రోజున సూర్యుని వైపు తిరిగి పూజ చేసుకోవాలి. శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసుడికి దానం చేయాలి. సూర్యుడ్ని షోడ‌శ ఉప‌చార‌ముల‌తో పూజించి పాయ‌సం లేక పొంగ‌లి త‌యారుచేసి నివేద‌న చేస్తారు. పాలు పొంగిన‌ట్లు సౌభాగ్యం పొంగాల‌ని వేడుకొంటారు.

 

 

 


మార్గశిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవద్గీతలో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసంలో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వృక్షచాయ. ఇది గ్రీష్మఋతువులో చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమైన మార్గశీర్ష మాసంకుడా, అతి శీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిస్తే మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుస్తోంది . మార్గ శిరం సత్వ గుణాన్ని పెంచి భగవదనుభూతిని కలుగ చేస్తుంది. లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం. మార్గశిర్శమో! క్షేత్రములో సస్యములు పండి భారంతో వంగి మనోహరంగా ఉంటుంది. అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు.