Read more!

కృష్ణాష్టమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసా!

 

కృష్ణాష్టమి రోజు పూజ పూజ ఎలా చేయాలో తెలుసా!


హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. దీన్నే జన్మాష్టమి అని కూడా అంటారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన ఈ తిధిని పురస్కరించుకొని భక్తులంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు కర్మయోగి గాను, ధర్మానికి ప్రతిరూపం గాను భగవద్గీతను అందించిన భగవానుడిగాను కీర్తి పొందారు. అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమని పురస్కరించుకొని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో ఆచారం మనకి అందుబాటులో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్వాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కావున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

- శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకునే ముందు రోజు ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాల్సి ఉంటుంది. మీ పూజగదిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. 

-ఇంటి ముందు నుంచి శ్రీ కృష్ణుడి పాద ముద్రలను సున్నంతో పూజ గది వరకూ వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శ్రీ కృష్ణుడు మీ నైవేద్యం స్వీకరిస్తాడని భక్తుల నమ్మకం.

- శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణుడి బంగారు, వెండి విగ్రహం, లేదా చిత్ర పటానికి పూజలు పూజలు జరుపుతారు. కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగుతో చేసినటువంటి వంటకాలను నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా వెన్నను నైవేద్యంగా పెట్టవచ్చు.

- శ్రీ కృష్ణాష్టమి రోజు సరదాగా స్నేహితులతో కలిసి సాయంకాలం పూట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా గ్రామాలు పట్టణాల్లో వీధుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

-శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులకు సేవ చేయడం ద్వారా ఎంతో పుణ్యం పొందవచ్చు. ముఖ్యంగా ఆవులకు ఈరోజు అరటిపండ్లు, ఉడకపెట్టిన సెనగలు, ఎండు గడ్డి తినిపించడం ద్వారా మీరు గో సేవను చేయవచ్చు.

కృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడిని ఎలా ధ్యానించాలి:

-శ్రీకృష్ణుడు బాల గోపాల రూపంలో వికసించి ఆకుపై నిద్రిస్తాడు.
-అతని శరీరంలో అనంతమైన విశ్వాలు ఉన్నాయి.
-కృష్ణుడు అంటే ఆకర్షించడం.
- కృష్ణుడు అంటే పారవశ్యం లేదా సంపూర్ణ మోక్షం వైపు ఆకర్షించేవాడు.
- శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తూ, ఆయనకు నమస్కారాలు చేయండి.
-కృష్ణుడికి నమస్కరించి చివర్లో చేతిలో అక్షత, పుష్పం పట్టుకుని, దానిపై నీళ్లు వదిలి శ్రీకృష్ణుడికి సమర్పించాలి.

కృష్ణ జన్మాష్టమి మంత్రం:


'క్రుం కృష్ణాయ నమః'
'ఓం శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణ తమాయ స్వాహా'
'గోకులనాథాయ నమః'
'గోవల్లభాయ్ స్వాహా'
'ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీం'.