Read more!

హనుమాన్ కార్యసిద్ధి మంత్రం శాస్త్రీయం, హేతుబద్దం కూడా!!

 

హనుమాన్ కార్యసిద్ధి మంత్రం శాస్త్రీయం, హేతుబద్దం కూడా!!

 

ప్రతీ ఒక్కరికీ తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఎంతో ఆశగా ఉంటుంది. అయితే కొందరు ఎంత శ్రద్దాసక్తులతో పనులు మొదలుపెట్టినా, ఏవో అడ్డంకుల వల్ల ఆగిపోతుండటం లేదా పని అసలు మొదలవ్వక వెక్కిరించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏమి చేయాలో తోచక చాలా సంఘర్షణ అనుభవిస్తూ ఉంటారు. కానీ శాస్త్రీయంగానూ, అధ్యాత్మికంగానూ, హేతుబద్ధంగానూ అన్ని విధాలా మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఉంటాయి. అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. మంత్రంలో హేతుబద్దం శాస్త్రీయం ఏమిటని ఎగతాళి చేయకండి. 

రామాయణం ఏడు కాండముల అద్భుతమైన కావ్యం. ఇందులో ప్రతీ కాండం లో సర్గలు ఉంటాయి. ఈ సర్గల్లో మళ్ళీ శ్లోకాలు ఉంటాయి. ఇలా మొత్తం 24 వేల శ్లోకాల సమ్మేళనమే రామాయణం. ఈ రామాయణంలో సుందరకాండ అయిదవది మరియు చాలా ప్రత్యేకమైనది. రామాయణంలో ప్రతి కాండం కు రామచంద్రుని స్థితి గతుల ఆధారంగా పేర్లు ఉన్నాయి. కానీ ఈ అయిదవ కాండం కు సుందరకాండ అని ఎందుకు పేరు అంటే, సుందరకాండలో జరిగే ప్రతీది ఎంతో సుందరమైనది అని, అందుకే సుందరకాండ అనే పేరు పెట్టారని వాల్మీకి మహర్షి చెప్పారట. 

ఈ సుందరకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది. 

【త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ | హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ || 5.39.4

సుందరకాండ లోని, 39 వ సర్గంలో, అయిదవ శ్లోకంగా ఉన్న ఈ మంత్రంను సీతాదేవి హనుమంతుడికి చెబుతూ…. హనుమా!! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించగల సమర్థుడివి నువ్వే!! ఇదిగో ఈ మంత్రంను సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు. ఇది నీవల్లనే సాధ్యమవుతుంది. అని చెప్పిందట. హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపం చేస్తూ దాన్ని సిద్ధి పొంది సీతాదేవి రావణుడి చేర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగాడని పురాణ కథనం. అందుకే ఆ మంత్రాన్ని హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా చెప్పుకుంటున్నారు. దీన్ని ప్రతిరోజు 108 సార్లు, 40 రోజుల పాటు చెప్పుకోవడం వల్ల అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి.

ఇక హేతుబద్ధంగా మరియు శాస్త్రీయంగా చూస్తే ఒక మంత్రాన్ని ఓపికగా 108 సార్లు ప్రతి రోజు చెప్పుకోవడం వల్ల మనిషిలో సంకల్ప సిద్ధి పెరుగుతుంది, ఓర్పు ఎక్కువ అవుతుంది. ఇక రామాయణంలోని మరియు మనం చెప్పుకున్న హనుమాన్ కార్యసిద్ధి మంత్రం సంస్కృత శ్లోకం. ప్రతి సంస్కృత శ్లోకాన్ని కొంత వైబ్రేషన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిల్టర్ చేసి మానసికంగా మరియు శారీరకంగా మనిషిని దృఢంగా మారుస్తుంది. మనిషి మానసిక శారీరక స్థితి మెరుగైతే ముందుకంటే మంచి పలితాన్ని సాదించగలుగుతాడు. అంతేకాదు దైవం అనే నమ్మకం చాలా గొప్ప క్రమశిక్షణను మనిషిలో కలిగిస్తుంది. 

ఈవిధంగా అన్నివిధాలా విజయం నడిపిస్తుంది ఈ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం.

◆ వెంకటేష్ పువ్వాడ