Read more!

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరడం లేదా... ఏకాదశిరోజు ఇలా చేస్తే..

 

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరడం లేదా... ఏకాదశిరోజు ఇలా చేస్తే..

ఒకప్పుడు చదువు, ఉద్యోగం, పిల్లలు, ఆరోగ్యం గురించి చాలామంది ఇబ్బందులు పడుతుండేవారు. కానీ ఇప్పుడు వీటి చెంతకు పెళ్లి కూడా వచ్చిచేరింది. మంచి ఉద్యోగం, చక్కని రూపం, చక్కని కుటుంబం ఇన్ని ఉన్నా కూడా కొందరికి పెళ్ళి కాదు. కొందరు జాతకదోషం అంటారు. మరికొంందరు ఏదో లోపం ఉందంటారు. ఇంకొందరు పరిష్కారాలు చేయించుకోవాలని చెబుతారు. అయితే అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా పెళ్ళి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సంబంధాలు చేతుల దాకా వచ్చి విఫలమవుతున్నా ఈ కార్తీక ఏకాదశి రోజు ఈ పనులు చేయాలి. అలా చేస్తే వివాహ యోగం సిద్దిస్తుందని పండితులు అంటున్నారు.

కార్తీకమాస శుక్లపక్ష ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఈరోజు విష్టుభగవానుడు నాలుగు నెలల యోగ నిద్రనుండి మేల్కొంటాడు. ఈ కారణంగానే ఏకాదశి తరువాత నుండి శుభకార్యాలు  జరగడం మొదలవుతుంది. ఆ కాలంలో చేసే పూజలు ఆ విష్ణుభగవానుడిని తాకుతాయి. అందుకే ఈ కార్తీక మాసం విష్ణువుకు ప్రీతికరమని చెబుతారు. ఈ మాసంలోనే తులసి పూజ కూడా చేస్తారు. ఇకపోతే వివాహ యోగ్యం కోసం కార్తీక ఏకాదశి రోజు విష్టు భగవానుడిని కింది విధంగా పూజించాలి.

ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం,ధ్యానం పూర్తీ చేయాలి. ఆ తరువాత విష్టువును ఆరాధించాలి. విష్ణు ఆరాధన సమయంలో కుంకుమ, పసుపు, చందనం తో అర్చించాలి. పసుపు రంగు పువ్వులు సమర్పించాలి.  విష్టు ఆలయాన్ని సందర్శించాలి.  ఇలా చేస్తే  వివాహ యోగ్యం కలుగుతుంది.

కోరుకున్న కోరిక న్యాయబద్దమైనది అయినా దానికి సరైన పరిస్థితులు ఉన్నా కొందరికి తమ కోరికలు తీరవు. ఇలాంటి వారు ఈ కార్తీక ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజ చేయడం, రావి చెట్టు మొదట్లో నీరు పోయడం చేయాలి. రావి చెట్టులో విష్టుభగవానుడు నివశిస్తాడని చెబుతారు. ఇలా చేయడం వల్ల విష్టుమూర్తి తృప్తిపడి కోరిన కోరికలు తీరుస్తాడు.

                                                *నిశ్శబ్ద.