Read more!

మంగళగిరి గంగాభ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయం Mangalagiri Malleswaralayam)

 

మంగళగిరి

గంగాభ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయం

(Mangalagiri Ganga Bhramarambika Sameta Malleswaralayam)

గంగాభ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయం అతి ప్రాచీనమైన దేవాలయం. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. అంతరాయంలో మల్లేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన పార్వతీదేవి, బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులను సంతుష్టులను చేస్తారు. ఇక్కడ ముగ్ధమోహనం గావించే ఆంజనేయ స్వామి, బాల గణపతి ప్రతిమలు కూడా ఉన్నాయి. అనేక ఆలయాలకు మల్లేనే, భ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయంలో నవగ్రహాలను ప్రతిష్టించారు.

 

మంగళగిరి భ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయంలో భక్తులు నిత్యం అర్చనలు, హారతులు చేయించుకుంటారు. ఇక్కడ ఆరుద్ర నక్షత్ర పూజ ప్రత్యేకంగా చేస్తారు. ఇక విశేష పర్వదినాల్లో ఆయా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు, మహా శివరాత్రి వేడుకలు, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.