Read more!

భద్రాచలంలో హనుమజ్జయంతి ఉత్సవాలు

 

భద్రాచలంలో హనుమజ్జయంతి ఉత్సవాలు

 

 

 

 

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వేంచేసియున్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలం అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం 5 గంటలకు పవిత్ర గోదావరి నది నుండి తీర్థ జలాన్ని తీసుకువచ్చి అభిషేకం నిర్వహిస్తున్నారు. పంచామృతాభిషేకం, నవకలశాభిషేకం, స్నపన తిరుమంజనం, విశ్వక్షేణ పూజ నిర్వహించనున్నారు. అనంతరం హనుమత్‌ హోమం నిర్వహించి భక్తుల దర్శనార్థం స్వామివారిని పుష్పమాలలతో అలంకరిస్తారు. సాయంత్రం 108 అరటి పండ్లతో స్వామివారి అష్టోత్తర శత నామార్చన సామూహిక సహస్ర నామార్చన, హనుమాన్‌ చాలీసా పారాయణం, సుందరాకాండ పారాయణం జరిపించనున్నారు. స్వామివారికి వడమాలలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించనున్నారు. లక్ష తమలపాకులతో అర్చనలు నిర్వహించనున్నారు.

 

 

 

 


మానవ జీవితానికి జీవన అనురక్తికి, ఆప్యాయతానురాగాలకు రామాయణమే నిలయం. రామాయణ మహాకావ్యాన్ని సుసంపన్నం చేసి నేటికీ చిరంజీవిగా నిలిచి, భక్తుల చేత హనుమంతుడు పూజలందుకుంటున్నాడు. రామ నామామృతంలో పరవశుడై భక్తులకు తోడునీడగా ఉంటున్నాడు. సకల శాస్త్ర కోవిదుడుగా నవవ్యాకరణ పండితుడుగా, యోగులలో మహాయోగిగా మహాశక్తి సంపన్నుడుగా వినతికెక్కాడు. సేవ, రక్షణ అనే రెండు అంశాలకు ప్రత్యక్ష సాక్షే హనుమంతుడు. కేసరి అంజ నీదేవి దంపతులకు వాయుదేవుని వలన (ఆదిదేవుడైన శివుని అంశలో రుద్ర స్వరూపునిగా) పుత్రుడుగా జన్మిం చాడని పరాశారసంహిత పేర్కొంది.