అతనిదే స్థిరమైన మనసు

 

 

 

అతనిదే స్థిరమైన మనసు

 

 

బొంకనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం

జంకనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం

గొంకనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా

తంకమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!

 

ఎట్టిపరిస్థితులలోనూ అబద్ధాన్ని చెప్పనివాడే యోగ్యుడు. శత్రుసమూహములు ఒక్కసారిగా దండెత్తిరాగా, యుద్ధమునకు వెనుదీయనివాడే యోధుడు. యాచకుడు చేయిచాచగా, దానం చేయడానికి వెనుదీయనివాడే దాత. నిన్ను సేవించి భజించుకున్నవాడినే స్థిరమైన మనసు కలిగినవాడిగా ఎంచవచ్చు.


..Nirjara