వంటవాడికి కోపం ఉంటే...

 

 

 

వంటవాడికి కోపం ఉంటే...

 

 

నీచున కధికారంబు బాచకునకు నాగ్రహంబుఁ బంకజముఖికిన్‌

వాచాలత్వము బుధసంకోచముఁగడు బాధకములు గువ్వలచెన్నా!

 

నీచుడైనవాడికి అధికారం ఉంటే అది దుర్వినియోగం అవుతుంది; వంటవాడికి ముక్కుమీద కోపం ఉంటే, అతను చేసే వంట మీద ఆ ప్రభావం ఉంటుంది; అందగత్తెకు వాచాలత్వం ఉంటే, నలుగురి ముందరా  ఆమె చులకన అయిపోతుంది; పండితునికి నోరువిప్పలేని సంకోచం ఉంటే, అతని పాండిత్యం బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇలాంటి గుణాల వల్ల ఇటు వారికీ, అటు ఇతరులకీ కూడా నష్టం తప్పదు.

 

...Nirjara