పాపం పిసినారి
పాపం పిసినారి
అతిగుణహీనలోభికిఁబదార్థము గల్గిన లేకయుండినన్
మితముగఁగాని కల్మిగల మీఁదటనైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద, నేఱులునిండిపాఱినన్
గతుకగఁజూచుఁగుక్కదన కట్టడ మీఱక యెందు భాస్కరా!
గుణహీనుడైన లోభి దరిద్రంలో అల్లాడుతున్నా మితంగానే భుజిస్తాడు, సంపదలతో అలరారుతున్నా మితంగానే భుజిస్తాడు. డబ్బులు ఎక్కడ ఖర్చయిపోతాయో అని కడుపునిండా తిండి కూడా తినడు. ఎందుకంటే అతని దృష్టిలో ఈ శరీరమూ, సంపదలూ శాశ్వతం కనుక! నదులు నిండుగా పారుతున్నా కూడా కుక్క తన అలవాటు ప్రకారం నాలుకతో నీటిని కాస్త కాస్తగానే తాగే ప్రయత్నం చేస్తుంది కదా!
..Nirjara