రామనామమే ఖడ్గం

 

 

 

రామనామమే ఖడ్గం

 

 

దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ

కరతల హేతిచే దెగి వకావకలై చనకుండ నేర్చునే

దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో

త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ!

 

పాపకర్మలు ఒక బంధం వంటివి. ఈ బంధాన్ని అనుసరించి భయ దుఖాలు కలుగుతుంటాయి. కానీ రామనామం అనే భీకర ఖడ్గంతో, ఎలాంటి ఘోరపాపమైనా తుత్తునియలైపోక తప్పదు. అగ్నిని చేరుకున్న మిడతల దండు అందులో భస్మం కాక మానదు కదా!

 

..Nirjara