ఇవీ గొప్పవి

 

 

 

ఇవీ గొప్పవి

 

 

నదులయందు గంగ, ననలందు సంపెంగ

సతుల సీత, గ్రంథతతుల గీత,

కవులయందు గొప్ప కాళిదాసుండురా

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

నదులన్నింటిలోకీ గంగానది గొప్పది. పూలలోకెల్లా సంపెంగ గొప్పది. ఆడవారిలో సీతాదేవికి సాటిలేదు. మరి గ్రంథాలలో గీతని మించింది లేదు. కవులలో కాళిదాసంతటి ఘనుడు లేడు.