అమృతం దొరికేదాకా

 

 

 

అమృతం దొరికేదాకా

 

 

రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా

న భేజిరే భీమ విషేణ భీతిమ్‌ ।

సుధాం వినా న ప్రరయుర్విరామం

న నిశ్చితార్థాద్విరమంతి ధీరాః ॥

 

క్షీరసాగరమధనం చేసిన దేవతలు, తమకు రత్నవైఢూర్యాలు దక్కినంత మాత్రాన సంబరపడిపోలేదు. కాలకూట విషం బయటపడినంత మాత్రాన చిరాకుపడిపోలేదు. అమృతం దక్కేదాకా తమ ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ధీరులైనవారు కూడా ఇంతే! తాము నిశ్చయించుకున్న కార్యం నెరవేరేదాకా వెనక్కి తగ్గరు.

 

..Nirjara