ఉండీ లేనట్లే!

 

 

 

ఉండీ లేనట్లే!

 

 

దానపరోపకారగుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్

లేని వివేకశూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్

పూనినవేళ నొక్కసరి పోలును జీకువ కర్థరాత్రి యం

దైన నదేమి? పట్టపగ లైన నదేమియు లేదు భాస్కరా!

 

గుడ్డివాడికి పగలైనా చీకటైనా ఒకే తీరుగా ఉంటుంది. అలాగే... దానం చేసే లక్షణం కానీ, పరోపకారానికి పూనుకొనే గుణం కానీ లేనివాడికి సంపదలు కలిగినా, దరిద్రంలో ఉన్నా ఒక్కటే!

 

..Nirjara