ఎప్పుడూ దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా...
ఎప్పుడూ దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా...
ప్రపంచంలోని ప్రతి మతం, ప్రతి ధర్మం ఇతరులకు దానం చేయడాన్ని చాలా గొప్ప విషయంగా చెబుతుంది. మతాలు దానాన్ని పుణ్యకార్యం అని చెబుతాయి. సమాజం ఎవరికైనా ఏదైనా దానం చేస్తే దాన్ని మానవ సేవ అని మానవత్వం అని చెబుతుంది. మతం ఏదైనా ఇతరులకు ఏదైనా వస్తువు లేదా ధనం లేదా ఆహారం.. ఇలా ఇవ్వడాన్ని దానంగా పేర్కొంటాయి. అయితే హిందూ ధర్మం మాత్రం ఎప్పుడూ దానం చేయరూడని వస్తువులు కొన్ని ఉన్నాయని చెబుతోంది. ఇంతకూ అవేంటి? ఎందుకు దానం చేయకూడదు? తెలుసుకుంటే..
చెరిగిన లేదా పాత బట్టలు..
చెరిగిన బట్టలు లేదా పాత బట్టలను దానం చేయడం మంచిది కాదు. అలాంటి దుస్తులను దానం చేస్తే ఇంట్లో సానుకూల శక్తి తగ్గిపోతుందట. అలాగే ఇలాంటి దానాలు పేదరికానికి దారి తీస్తాయని కూడా అంటారు.
ఉప్పు..
సాయంత్రం సమయంలో ఉప్పు దానం చేయడం అశుభం అని భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఉప్పు చాలా ముఖ్యమైన వస్తువు. సూర్యాస్తమయం తర్వాత దీన్ని దానం చేస్తే ఇంట్లో ఇబ్బందులు కలుగుతాయట.
తులసి..
సాధారణంగా తులసి మొక్కను నాటినా, తులసిని దానం చేసినా చాలా మంచిది. తులసిని లక్ష్మీదేవి స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి తులసిని సాయంత్రం సమయంలో దానం చేయడం, కోయడం మంచిది కాదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని చెబుతారు.
పదునైన వస్తువులు..
పదునైన పస్తువులైన కత్తి లాంటి వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదట. వీటిని దానం చేస్తే ఇంట్లో ఉద్రిక్తత, కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేకత వంటి పరిస్థితులు ఏర్పడతాయట.
ఉక్కు పాత్రలు..
ఇంట్లో ఉపయోగించిన ఉక్కు పాత్రలను దానం చేయడం అస్సలు మంచిది కాదట. వాడిన ఉక్కు పాత్రలను దానం చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు తగ్గుతుందట.
నూనె..
నూనె శనిగ్రహానికి సంబంధం కలిగి ఉంటుందట. కారణం లేకుండా నూనెను దానం చేయడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు.
*రూపశ్రీ.