ఒత్తిడి నుండి ఉపశమనాన్ని ఇచ్చే భగవద్గీత లోని శ్లోకాలు..!
ఒత్తిడి నుండి ఉపశమనాన్ని ఇచ్చే భగవద్గీత లోని శ్లోకాలు..!
మనిషి జీవితంలో చాలాసార్లు వైఫల్యాలను ఎదుర్కొంటాడు. దీని ద్వారా తన మార్గాన్ని మెరుగుపరుచుకుంటాడు. తన పరిమితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతాడు. దీనితో పాటు వైఫల్యం వ్యక్తికి ఓపికను నేర్పుతుంది. ఇది విజయానికి మార్గాన్ని మరింత అందంగా చేస్తుంది. అయినప్పటికీ మనస్సు మాత్రం వైఫల్యాలు ఎదురైన ప్రతి సారి ప్రతికూల ఆలోచనలతోనూ, ఒత్తిడితోనూ నలిగిపోతూ ఉంటుంది. శ్రీ కృష్ణుడి ప్రకారం ఆనందం, దుఃఖం జీవితంలో అంతర్భాగాలు.. అవి వస్తూనే ఉంటాయి. కాబట్టి, "కర్మణ్యేవాధికరస్తే మా ఫలేషు కదాచన" అంటే "నీ పని చేయు, ఫలితాల గురించి చింతించకు" అని అన్నాడు.
శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప మాటలను మనసులో ఉంచుకుని లక్ష్యాల కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. అర్జునుడి అడుగులు యుద్ధం కోసం తడబడటం ప్రారంభించినప్పుడు శ్రీ కృష్ణుడు గీతను బోధించాడని చెబుతారు. అప్పటి నుండి జీవితంలోని కష్ట సమయాల్లో గీతను అధ్యయనం చేయాలని సలహా చెప్పబడింది. దాని ప్రభావంతో వ్యక్తి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. సరైన నిర్ణయం తీసుకోవడంలో విజయం సాధించవచ్చు. మనిషి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించగల భగవద్దగీత శ్లోకాలు ఉన్నాయి. వాటి అర్థాన్ని తెలుసుకుని, దానికి తగినట్టు ఆలోచించడం వల్ల ఒత్తిడి అనేది మంత్రించినట్టు మాయమవుతుంది. ఆ శ్లోకాలు ఏంటంటే..
ధ్యాయతో విషయాంపుంసః సంగస్తేషూపజాయతే । సంగత్సంజయతే కామాః కామత్క్రోధోభిజాయతే ।
ఈ శ్కోల అర్థం ఏమిటంటే.. మనం ఏదైనా చూసినప్పుడల్లా దానిని పొందాలనే కోరిక మన మనస్సులో పుడుతుంది. క్రమంగా మనం ఆ వస్తువుతో అనుబంధం పెంచుకోవడం ప్రారంభిస్తాము. కానీ ఆ కోరిక నెరవేరనప్పుడు, మనస్సు కూడా కోపంగా మారుతుంది. దాని ప్రభావం మంచిది కాదు. కాబట్టి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికలను నియంత్రించుకోవాలి.
"త్రివిధం నరకస్యేదం ద్వారం నాషన్మాత్మనః.
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్."
కోరిక, కోపం, దురాశ నరకానికి ద్వారాలు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
శ్రద్ధవాన్లభతే జ్ఞానం తత్రాపః సంయతేన్ద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరా శాన్తిమ్చిరేణాధిగచ్ఛతి ।
ఈ గీతా శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే.. విశ్వాసం, ఇంద్రియాలపై నియంత్రణ ఉన్న వ్యక్తి తన స్వంత సంకల్పంతో జ్ఞానాన్ని పొందుతాడు.
క్రోధాద్భవతి సమోహాః సమోహాతస్మృతివిభ్రమః । స్మృతిభ్రంశద్బుద్ధినాశో బుద్ధినశత్ప్రణశ్యతి॥
కోపం ఒక వ్యక్తి హృదయాన్ని, మనస్సును నాశనం చేస్తుంది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడల్లా అన్ని తర్కాలు పోతాయి. కాబట్టి సమయం ఏదైనా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని కోపానికి దూరంగా ఉండాలి.
*రూపశ్రీ.