Read more!

మహాలక్ష్మీ దేవి నాల్గవ రోజు (Mahalakshmi Devi Day - 4)

 

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం
లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద
విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలిక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుంద ప్రియాం


కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మన్మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. "యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోనో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.


నైవేద్యం - వడపప్పు

కావలసిన పదార్ధాలు

పెసరపప్పు - 1 కప్పు

తయారు చేయు విధానం

పెసర పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.




నైవేద్యం - చలివిడి

కావలసిన పదార్ధాలు
బియ్యం - రెండు కప్పులు
బెల్లం లేదా పంచదార- కప్పు
కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు
ఇలాచీలు- 5
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
నీళ్ళు - రెండు కప్పులు
జీడిపప్పు - 10


తయారు చేయు విధానం

ముందుగా బియ్యాన్ని నీళ్ళలో 8 గంటల పాటు నానబెట్టి, నీళ్ళు వంచి బియ్యాన్ని పొడి వస్త్రం పై ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత గ్రైండర్ లో మెత్తని పిండిలా చేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళల్లో, పంచదార లేదా బెల్లం కరిగించుకోవాలి . ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసి బాగా కలపాలి. మూకుట్లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలను గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, ఈ ముక్కలను, ఇలాచీ పొడిని చలివిడిలో కలుపుకోవాలి.