Read more!

బోనాలు గురించి మీకు తెలియని విశేషాలు...

 

బోనాలు గురించి మీకు తెలియని విశేషాలు...

 

 

అసలు అమ్మవారికి ఎందుకు భోజనం పెట్టాలి? ఎందుకు ఈ సంప్రదాయం వచ్చింది అనేదానికి మరో కథ కూడా ప్రచారములో ఉంది. ప్రతి సంవత్సరము కూడా శివ పార్వతుల కళ్యాణం చేస్తాము। అంటే అమ్మవారు ఎప్పుడు కొత్త పెళ్లికూతురే. ఆషాఢ మాసములో కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి రావడము అనేది ఒక ఆచారము. అందుకనే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు చక్కటి భోజనం పెట్టి, ఆ తరువాత పసుపు, కుంకుమ, చీర అప్పులపాలై  పెట్టాలని కాదు, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు పెట్టి మర్యాద చేయడము అనేది, అలాగే ఇక్కడ ఉన్నప్పుడు తనకు కావలసిన వస్తువులు అమర్చి పెట్టడము, ప్రియంగా మాట్లాడడము, ఆదరించడము, మన్ననగా చూసుకోవడము అనేది సాధారణముగా ప్రతి ఇంట్లో చేయవలసిన పని కాబట్టి, అది నేర్పించడం కోసము, గౌరవించడము కోసము వచ్చిన ఒక ఆచారంగా కూడా బోనమును సమర్పించడము గురించి చెపుతూ ఉంటారు. చాలా మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు చీరె,సారె, పసుపు, కుంకుమ,గాజులు వంటివి అర్పించి తమ ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని భావించి ఆనందిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి అయితే ప్రత్యేకముగా ఒక కథ ప్రచారములో ఉంది. చాలా కాలము క్రితము ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది. అప్పుడు ఉజ్జయినిలో ఉన్న సైనిక బెటాలియన్ వాళ్ళు అక్కడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కుకుని, ప్లేగు వ్యాధి తగ్గగానే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టించి పూజలు నిర్వహించి అమ్మవారికి భోజనం పెట్టి, తమ ఇంటి ఆడపడుచుగా, కష్టముల నుంచి గట్టెక్కించిన కల్పవల్లిగా పూజించారనీ, అదే ఒక ఆచారంగా ఆ తరువాత స్థిరపడింది అని మన పెద్ద తరాల వాళ్ళు చెపుతూ ఉంటారు. ఆ భోజనమే కాలక్రమములో బోనం అయింది అనీ, ఆ తరువాత అదే ఇంత పెద్ద ఉత్సవం అయింది అని తెలుస్తోంది.

 కథ ఏదైనా కూడా వీటన్నింటి సారాంశం ఏమిటి అంటే లోకం లో ఏ కష్టం వచ్చినా లోకాలన్నిటినీ కాపాడే తల్లి కనుక తాను చూస్తూ ఊరుకోదు. ఇక్కడ పెద్దలు ఇంకో మాట కూడా చెప్తారు। ఒకసారి లోకంలో విపరీతమైన కరువు వచ్చిందట. లోకంలో పాపాలు ఎక్కువ అవ్వడం వల్ల వర్షాలు లేక ఎక్కడా గడ్డి గింజ కూడా మొలవక ప్రాణులన్నీ ఆకలితో అల్లాడుతూ ఉంటే ఆ తల్లి తన బిడ్డల కష్టం చూడలేక తానే శాకంబరీ దేవిగా అవతారం దాల్చి తన పిల్లలు అంటే మనం అంతా, పక్షులు, మృగాలు, కీటకాలు ప్రతిదీ కూడా బస్తీకి కావలసిన ధాన్యాలు, కూరగాయలు సమస్తం తానే సృష్టించింది అని, అందుకే ఆ తల్లికి కృతజ్ఞతగా శాకంబరీ అవతారం వేసి ఆషాఢ మాసములో వచ్చే పండ్లు, పూలు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించి, ఆ తరువాత వాటిని ప్రసాదముగా భక్తులకు అందచేస్తూ ఉంటారు. భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత మరలా భగవంతుడికే పెట్టి ఆనందించే సంప్రదాయం।నేను పెడుతున్నాను, నా చేతులతో పెడుతున్నాను అనే తృప్తి। నిజానికి అన్నీ అమ్మవారివే. మనం అమ్మవారికి పెడుతున్నాము అనుకోవడం మన ఆనందం కోసం। అయితే  నిజానికి ఇక్కడ ఎవరీ అమ్మవారు అంటే నిజానికి ఒక చోట మహాకాళిగా, ఒక చోట మహా లక్ష్మి గా, ఒక చోట మహా సరస్వతిగా పూజలందుకుంటున్న ఈ తల్లి ఎవరు అంటే..

గీర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి
శాకంబరీతి శశి శేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమః త్రిభువనైక గురోస్టరున్యై

అంటూ కీర్తించారు ఆది శంకరులు...
ఆ తల్లినే గీర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి, శాకంబరీతి శశి శేఖర వల్లభేతి, సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై అంటే ఆ తల్లి మహాలక్ష్మి గా మహావిష్ణువు భార్యగా ఉంటుంది. మహా సరస్వతీ దేవిగా బ్రహ్మ దేవుని ఇల్లాలుగా ఉంటుంది.  ఆ తర్వాత శాకంబరీతి శశి శేఖర వల్లభేతి  అంటే చంద్రుడిని శిరసు పైన ధరించిన శివుని భార్యగా శాకంబరీ దేవిగా ఉంటుంది అని తెలిపారు।బాగుంది అమ్మవారు ఎలా ఉంటుంది అనేది తెలిపారు.మరి ఏమి చేస్తుంది అంటే సృస్తి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  అంటే ఆ తల్లి తానే సృష్టి చేయిస్తుంది. తానే  స్థితికారిణి అయి పోషిస్తుంది.  తానే ప్రళయం లో అందరినీ లయం చేసుకుంటుంది కూడా.  అలాంటి త్రిభువనాలను పెంచి పోషించి కాపాడి మరలా తనలోనే లయం చేసుకునే ఆ మహా శక్తిని తస్యై నమః త్రిభువనైక గురోస్టరున్యై, అలాంటి అమ్మకు నమస్కరిస్తున్నాను, నేను ఆ అమ్మను ఉపాసిస్తున్నాను అని ఈ సంస్కృత పండితుడు చెపుతూ ఉంటే, ఏమీ తెలియని వారు కూడా అమ్మవారు అనుకుంటూ, అమ్మ అనుకుంటూ మనసారా నమస్కరిస్తూ ఉంటే నా బిడ్డలు అనుకుంటూ పొంగిపోయి కాపాడే చల్లని తల్లి.  


అందుకే ఈ సందర్భములో, ఈ ఆషాఢ మాసములో, ఆ చల్లని తల్లికి భోజనం సమర్పించి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు అందరు. అయితే కొంచెం జాగ్రత్తగా పరికించి చుస్తే ఇలా ప్రకృతి స్వరూపిణి అయినా అమ్మవారిని పూజించడము, అమ్మవారికి భోజనము పెట్టి ఆదరించడము  అనేది ఈ ఒక్క ఆషాఢ  మాసముతో పూర్తి అవ్వదు.  శ్రావణ మాసములో వరలక్ష్మి దేవి గా, మంగళ గౌరీ దేవిగా, ఆ తరువాత మార్గశిర మాసములో మహాలక్ష్మి దేవిగా, సంక్రాతి సమయములో సస్య లక్ష్మి, పౌష్య లక్ష్మిగా, అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇంకా తెలంగాణ కానీ ప్రాంతాలలో పొంగళ్ళు అనే పేరుతో నివేదనలు ఆయా గ్రామ దేవతలకు వేరే వేరే సందర్భాలలో జరగడం అనేది మనం చూస్తూ ఉంటాము.  అంటే శక్తి ఆరాధన, స్త్రీ శక్తి ఆరాధన, సృష్టి  చేయగలిగిన స్త్రీ శక్తి ఆరాధన అనేది ఒక రోజు చేసి ఆపేసేది కాదు. ఒక రోజు చేసి మర్చిపోయేది కాదు. నిజానికి అమ్మకు కృతజ్ఞత చెప్పడము అంటే అది ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. అమ్మకు కావలసింది మనం ప్రేమగా ఉండడమే. ఈ లోకాలను కాపాడే తల్లికి మనం ప్రేమను చూపించగలము.  భక్తితో ఉండగలము. అమ్మని మన ఇంటి ఆడపడుచుగా భావించి ఆ చల్లటి తల్లికి భోజనం పెట్టి అదే చెట్టోటి పసుపు కుంకుమలు కూడా పెట్టి వీలైనంతలో చీర సార్లు పెట్టి ఆదరించి మరలా ఈ ఆషాఢ మాసము తరువాత ఆ తల్లి తిరిగి తన భర్త వద్దకు వెళ్ళిపోతుంది అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు. అలా పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను ఆదరించడం, గౌరవించడం, మర్యాద చేయడం అనే సంప్రదాయాన్ని తెలిపే ఈ తెలంగాణ సాంప్రదాయ పండుగ బోనాలు.  మనమంతా కూడా ఇదంతా అర్ధం చేసుకుని ఆ తల్లిని వేడుకుని, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని, కోడళ్ళని మర్యాదగా చూసుకుని ఆ తల్లి ఆశీస్సులు పొందుదాం. తరిద్దాం. https://www.youtube.com/watch?v=t4FY6CU2JkM&t=75s