Read more!

నేటి నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం

 

నేటి నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి

 

 

కల్యాణోత్సవం

 

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి తరువాత అంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, పర్యాటకులను విశేషంగా ఆకర్షించే దర్శనీయ ప్రాంతం అన్నవరం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 15 వరకూ జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి,అమ్మవార్లను శుక్రవారం పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలను చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. 10 వ తేదీ రాత్రి 9.30 గంటలకు సత్యదేవుని దివ్యకల్యాణం జరుగుతుంది.  పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలతో పాటు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం హిందువుల ఆచారం. పంపాతీరంలో వెలిసిన శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి రత్నగిరి కొండపైకి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు. ఘాట్‌ రోడ్డుపై వాహనాలపైనా వెళ్ళవచ్చు. మెట్ల మార్గంలో వెళ్ళే టప్పుడు కనక దుర్గ, వనదుర్గ ఆలయాలను తప్పక సందర్శించాలి. దేవినవరాత్రి ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం ప్రత్యేకమైన ఆకర్షణ.