Read more!

భద్రాచలం వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 

భద్రాచలం వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు

 

 

ప్రారంభం ...

 

 

 

 

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు సోమవారం (31-03-2014) నుంచి ప్రారంభంమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ఉగాది ప్రసాద నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 4న స్వామి వారి ఉత్సవ మూర్తు లకు విశేష స్నపనం నిర్వహించి ఉత్సవాలకు అంకురారోపణ జరగ నుంది.

 

 

 

 

 

5న ధ్వజపటభద్రక మం డల లేఖను, గరుడాధివాసం, 6న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుష్టార్చనం, బేరీ పూజ, దేవతా హ్వానం, బలిహరణం, 7న ఎదు ర్కోలు ఉత్సవం, 8న స్వామి వారి తిరుక ల్యాణ ఉత్సవం, 9న మహాపట్టాభిషేకం, 10న సదస్యము,11న తెప్పోత్సవం, చోరోత్సవం, 12న ఉంజల్‌ సేవ,13న వసం తోత్సవం, 14న పుష్పయాగంతో బ్రహ్మో త్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 14 వరకు జరగనున్నాయి.

 

 

 

 

సీతారాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం తలంబ్రాలు కలిపే వేడుకను చిత్రకూట మండపంలో నిర్వహించనున్నారు. ఉత్సవాలను పరస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ, ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 8న నిర్వహించనున్న రామయ్య కల్యాణానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ శనివారం ఆయన భద్రాచలంలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న నవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, ఆ రోజుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

 

 

 

 

స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేటి నుంచి 14 వరకు స్వామివారి నిత్య కల్యాణాలు నిలిపివేసి సాయంత్రం వేళ స్వామికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. అదే విధంగా దర్భారు సేవలు కూడా దేవస్థానం నిలిపివేయనుంది. 22 వరకు పవళింపు సేవలు జరగవు.