నారా రోహిత్ ' సావిత్రి ' టీజర్ వచ్చింది..
చిత్రమైన కథల్ని ఎంచుకుని, వాటితో విజయం సాధించడం నారా రోహిత్ కు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు ఈ నారావారబ్బాయి. 'సావిత్రి ', ‘తుంటరి’, సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.ఇవి కాక ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘వీరుడు’, ‘కథలో రాజకుమారి’, ‘జ్యో అచ్యుతానంద’, ‘రాజా చెయ్యి వేస్తే’ లాంటి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.