English | Telugu

' గుప్పెడంత ప్రేమ ' టీజర్ లాంచ్

ఐ వింక్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వినోద్ లింగాల రచనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ' గుప్పెడంత ప్రేమ ' టీజర్ రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి ప్రశంసలు పొందింది. ఫస్ట్ లవ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో నూతన నటులు సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య పరిచయం అవుతున్నారు.

దర్శకుడు వినోద్ లింగాల మాట్లాడుతూ ఫస్ట్ లవ్ బ్యాక్ డ్రాప్ లో హృదయానికి హత్తుకునే ఫీల్ గుడ్ మూవీ లా చితికరిస్తున్నామని తెలిపారు. ఒక అందమైన ప్రేమ కథని ఈ ' గుప్పెడంత ప్రేమ ' ద్వారా ప్రేక్షకులకి అందిస్తున్నామన్నారు. అద్భుతమైన కథ, కథనం, విజువల్స్, చక్కటి సంగీతం ఉన్న ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా అందర్నీ ఆకట్టుకుంటుదన్నారు. నేటి యువత కథలో తమను తాము చూసుకుంటారన్నారు వినోద్.

ఐ వింక్ ప్రొడక్షన్స్ సంస్థ సభ్యులు సుజిత్, పావని మాట్లాడుతూ లాస్ట్ షెడ్యూల్ శిల్లోంగ్, చిర్రపుంజి, మేఘాలయ లాంటి కొత్త లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత మధుర శ్రీధర్ ల దర్శకత్వ శాఖల్లో ఈ చిత్ర దర్శకుడు వినోద్ లింగాల పని చేశారు.

నవనీత్ సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ' గుప్పెడంత ప్రేమ 'కు సంజయ్ లోక్ నాథ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, వనమాలి, శ్రీమణి గీతరచయితలుగా,బసవ ఎడిటర్ గా చేస్తున్నారు.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమాకు త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను చేయనున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.