Read more!

English | Telugu

కమ్మా..కాపా..? వర్మ ఎవరివైపు..?

కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మకు వివాదాలతో ఫుట్ బాల్ ఆడుకోవడమంటే చాలా ఇష్టం. సాధారణంగా సినిమా వాళ్లందరూ వివాదాల్ని దూరంగా పెడతారు. కానీ వర్మ వాటితోనే సావాసం చేస్తుంటాడు. మీడియా ఫోకస్ ఎక్కువయ్యేకొద్దీ వర్మ కూడా తన డోస్ ను పెంచుతూ పోతున్నాడు. దానికి తోడు ట్విట్టర్ ఇప్పుడు అతనికి ఆయుధంగా మారింది. స్వేచ్ఛగా తన ఒపీనియన్స్ వదులుతూ, కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ, దానికి వచ్చే రియాక్షన్లను టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న స్టార్స్ తో ఆడుకుని తన పాపులారిటీ పెంచుకోవడం ఆయనకు ట్వీటుతో పెట్టిన విద్య..

పవన్ కళ్యాణ్ ది కాపుకులంలో పుట్టిన కమ్మ మనస్తత్వం అని అన్నా, ఎన్టీఆర్ కు దయ్యం పట్టిందా అంటూ కొచన్ చేసినా ఆర్జీవీకే చెల్లింది..
ఇక ఆర్జీవీ అరాచకానికి పరాకాష్ట, 'వంగవీటి' సినిమా. దాని పబ్లిసిటీ గురించి ఆయన ఎంచుకున్న మార్గం చాలా వివాదాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడిప్పుడే కులతగాదాలు చల్లబడుతున్నాయనుకుంటున్న సమయంలో, పెట్రోల్ పోసి మరి మంటపెడుతున్నాడు. సినిమా రిలీజైన తర్వాత ఈ అగ్గి గనుక రాజుకుంటే, ఆ తర్వాత దాన్ని ఆపడానికి తాతలు దిగిరావాలి. ఈ విషయం వర్మకు కూడా తెలుసు..సినిమా తీయడం తప్పు కాదు. కానీ దానికి కాపు కమ్మ పాటతో వర్మ ఎంచుకున్న ప్రమోషన్ రూట్ కరెక్ట్ కాదనేది చాలా మంది అభిప్రాయం.