Read more!

English | Telugu

రజనీకాంత్ ' కబాలీ ' ఫ్లాష్ బ్యాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా కబాలీ సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. అందుకు సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ స్టిల్ లో రజనీ వైట్ డ్రెస్ లో, షర్ట్ మీద బ్లడ్ తో కనిపిస్తున్నారు. మీసం కూడా లేదు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నడిచే ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఒక సంఘటన కారణంగా, గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ మారతాడని తెలుస్తోంది. ఆయన సూపర్ హిట్ మూవీ భాషా లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఇలాగే ఉండటం విశేషం..మరి కబాలీ లో రజనీ ఎలా అలరించబోతున్నారో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు. పిఏ రంజిత్ డైరెక్ట్ చేస్తున్న కబాలీలో రజనీతో జంటగా రాథికా ఆప్టే నటిస్తుండగా, వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.