Read more!

English | Telugu

కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఎలా ఉంది..?

నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన కృష్ణగాడి వీర ప్రేమగాథ గురించి టాలీవుడ్ చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. నాని ఏ సినిమాకు అవ్వనంత బిజినెస్ ఈ సినిమాకు జరగడమే అందుక్కారణం. దానికి తగ్గట్టే, నాని అభిమానులు కూడా సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేశారు . మరి సినిమా గురించి పూర్తి రివ్యూ చూసే ముందు అసలు సినిమాలో నాని పాత్ర ఎలా ఉండబోతోంది..? కృష్ణగాడు ప్రేక్షకుల్ని అలరిస్తాడా..? లేక బోర్ కొట్టిస్తాడా..ఓ లుక్కేద్దాం..

సినిమా ట్రైలర్లను బట్టి చూస్తే, హీరో బాలకృష్ణ ఫ్యాన్ అని తెలుస్తూనే ఉంది. ఇది సినిమాకు ఒక మేజర్ ప్లస్. ఈ ఒక్క పాయింట్ తో బాలయ్య అభిమానుల్ని హాల్ కు రప్పించుకున్నాడు దర్శకుడు. ఇప్పటి వరకూ హిట్టైన నాని సినిమాలన్నింటిలోనూ, అతని క్యారెక్టర్ ఫన్నీగా, నవ్విస్తూ ఉండేవే ఉంటాయి. కాస్త సీరియస్ గా చేసిన పైసా, ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు లాంటి సినిమాలన్నీ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. దీని బట్టి చూస్తే, ప్రేక్షకులు నాని సినిమాల్లో ' అలా మొదలైంది ' పాత్రనే చూస్తున్నారు. కొత్తగా ఏం ట్రై చేసినా, ఫ్లాప్ ను చేతిలో పెడుతున్నారు. సో, నాని ఈ సారి ప్రయోగాలకు పోకుండా చాలా ఫన్ తో, ' అందాల రాక్షసి ' లాంటి అందమైన ప్రేమకథ తీసిన హను రాఘవపూడితో కలిసి, కృష్ణగాడిలా జనం ముందుకు వచ్చాడు.
 

సినిమా ఎలా ఉంది..?

' కష్ణగాడి...' సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ నిడివి. కేవలం 145 నిముషాలు మాత్రమే ఉండే డ్యూరేషన్ తో, పెద్దగా బోర్ కొట్టకుండా సినిమాను ముగించే ప్రయత్నం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో ఉండే ఒక అమాయక కుర్రాడు కృష్ణ. అసలు ఎలాంటి ధైర్యం లేని కృష్ణ, తను ప్రేమించిన మహాలక్ష్మి కోసం ధైర్యాన్ని ఎలా కూడగట్టుకున్నాడు అనేది మెయిన్ ప్లాట్. హీరోయిన్ గా మెహ్రీన్ ఫర్లేదనిపించింది. నాని మాత్రం తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ నటించాడు. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమా కథ గత 20 ఏళ్లుగా టాలీవుడ్ లో రాని సబ్జెక్ట్ అని ముందే చెప్పాడు దర్శకుడు హను. అది నిజమే అనిపించేలా కథ, కథనాలని తీర్చిదిద్దాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తుంది. ఫైనల్ గా మంచి ఫీల్ తో ప్రేక్షకులు బయటికొస్తారు. పోలీస్ ఆఫీసర్ గా సంపత్ రాజ్ ఆకట్టుకుంటాడు. పిల్లలతో నాని పండించిన నవ్వులు ఆడియన్స్ కు కితకితలు పెడతాయి. ఇదీ ఇప్పటి వరకూ కృష్ణగాడి వీర ప్రేమగాథ గురించి ఉన్న సమాచారం.

నాని క్యారెక్టరైజేషన్ తో పాటు, కథ కథనాలు ప్లస్ అయితే కాస్త డ్రాగ్ అవుతున్నట్లు అనిపించే సెకండ్ హాఫ్ మైనస్.

పూర్తి రివ్యూ ను మరికాసేపట్లోనే తెలుగువన్ లో చూడండి..!!!