English | Telugu

పాట పాడుతున్న ' సరైనోడు '

మెగా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా, స్వయం కృషితో సౌతిండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఎదిగాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. మళయాళంలో అయితే, అక్కడి స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ తో సమానంగా బన్నీని ఆరాధిస్తారు. తాజాగా బన్నీ, తన అభిమానుల కోసం గొంతు సవరించుకుంటున్నాడు. ఇప్పటికే తన తోటి హీరోలందరూ పాటేసుకుంటుండటంతో, బన్నీ కూడా తన సినిమాలో ఒక పాట పాడటానికి రెడీ అయిపోయాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ' సరైనోడు ' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను పాడాడు బన్నీ. అల్లు అర్జున్ కు ' రేసుగుర్రం ' లాంటి మ్యూజికల్ ఇచ్చిన తమన్ సరైనోడుకు కూడా స్వరాలిస్తున్నాడు. బన్నీ పాడే స్పెషల్ సాంగ్ కోసం, అద్భుతమైన ట్యూన్ ను తమన్ స్వరపరిచాడట. ఇన్నాళ్లూ కళ్లు చెదిరే డాన్సులతో అభిమానుల్ని అలరించిన బన్నీ, తను పాడు పాటకు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి..

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.