English | Telugu

నారా రోహిత్ ' సావిత్రి ' టీజర్ వచ్చింది..

చిత్రమైన కథల్ని ఎంచుకుని, వాటితో విజయం సాధించడం నారా రోహిత్ కు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు ఈ నారావారబ్బాయి. 'సావిత్రి ', ‘తుంటరి’, సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.ఇవి కాక ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘వీరుడు’, ‘కథలో రాజకుమారి’, ‘జ్యో అచ్యుతానంద’, ‘రాజా చెయ్యి వేస్తే’ లాంటి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాదినేని తెరకెక్కిస్తోన్న ' సావిత్రి ' సినిమా టీజర్ ఈ రోజు రిలీజయ్యింది..

ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమా, టీజర్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
నారా రోహిత్ తన పాత లుక్స్ తోనే కంటిన్యూ అయ్యాడు. కానీ రెగ్యులర్ సీరియస్ క్యారెక్టర్లకు భిన్నంగా, సావిత్రిలో యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మాయాబజార్ సినిమాలోని ' అహ నా పెళ్లంట ' సాంగ్ తో టీజర్ ఎండ్ అవడం విశేషం. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై విబి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ' సావిత్రి ' మార్చి 5న థియేటర్లలో సందడి చేయనుంది.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.