Read more!

English | Telugu

తండ్రి ప్రొడ్యూస్ చేస్తే అంతేనా..?

టాలీవుడ్ లో కొడుకుల్ని లాంఛ్ చేసే ప్రొగ్రామ్ పెట్టుకున్న తండ్రులందరూ దెబ్బైపోతున్నారు. ఇప్పటికే ముగ్గురున్న ఈ లిస్ట్ లోకి మరొకరు చేరారు. గతంలో తమ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేసి బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ చాలా దెబ్బ తిన్నారు. కోలుకోవడానికి కూడా వారికి చాలా టైం పట్టింది. మొన్నీ మధ్యే అల్లుడు శీను గా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సినిమా హిట్ అని పేరు తెచ్చుకున్నా, తండ్రి జేబులు మాత్రం నింపలేకపోయాడు. ఇప్పుడు డైలాగ్ కింగ్ సాయికుమార్ వంతు వచ్చింది. తన తనయుడిని ఎలాగైనా మాస్ హీరోగా నిలబెట్టాలనే తపనతో, ఆయన తన సొంత ప్రొడక్షన్ లో బ్యానర్ పెట్టి పూర్తి చేసిన సినిమా గరం. ఇది కూడా ఇప్పుడు యావరేజ్ టాక్ నే సంపాదించుకుంది. సాయికుమార్ పెట్టినదంతా వస్తుందో లేదోనన్న డౌట్ అయితే జనాల్లో ఉంది. దాంతో టాలీవుడ్ లో కొడుకు సినిమాకు ప్రొడ్యూస్ చేస్తే పైసలు దక్కవు అంటూ గుసగుసలాడుకుంటున్నారు టాలీవుడ్ జనాలు..