English | Telugu

రేపు రాబోతున్న సినిమాలు

ప్రతీవారం లాగే ఈ శుక్రవారం కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, ప్రేక్షకుల్ని అలరించడానికి థియేటర్లలోకి కొత్త బొమ్మలు వస్తున్నాయి. మరి ఈ శుక్రవారం వస్తున్న కొత్త సినిమాలేంటో.. మీరే చూడండి..

గరం

సాయికుమార్ తనయుడు ఆది, అదాశర్మ జంటగా వస్తున్న సినిమా ' గరం '. ఫ్యామిలీ సినిమాలు డీల్ చేసే మదన్ మొదటిసారిగా పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన సినిమా గరం. ' శ్రీనివాసాయి స్క్రీన్స్ ' పేరుతో, సాయికుమార్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. గత కొంతకాలంగా సరైన విజయం లేని ఆది, ఈ సినిమా తనను మాస్ హీరోగా నిలబెడుతుందనే ఆశతో ఉన్నాడు.



కృష్ణగాడి వీర ప్రేమ గాథ

' భలే భలే మగాడివోయ్ ' తో సూపర్ సక్సెస్ లో ఊపు మీదున్న నాని, ' అందాల రాక్షసి ' సినిమాతో ఆకట్టుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ' కృష్ణగాడి వీర ప్రేమ గాథ '. నానికి జంటగా మెహ్రీన్ నటిస్తోంది. మహేష్ బాబుతో దూకుడు, ఆగడు తీసిన 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికే సినిమాకు టేబుల్ ప్రాఫిట్ వచ్చేసినట్టు సమాచారం. పూర్తి పాజిటివ్ బజ్ తో రిలీజవుతున్న ఈ సినిమా హిట్టయితే, నాని మరో మెట్టు ఎక్కినట్టే. నాని కెరీర్లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్ కావడం విశేషం.



ఫితూర్

' ఆషికీ 2 ' ఫేం సిద్ధార్ధ్ రాయ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఫితూర్ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛార్ల్స్ డికెన్స్ రాసిన ' గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ ' నవల ఆధారంగా ఫితూర్ తెరకెక్కింది. సినిమాలోని సింహభాగం షూటింగ్ కాశ్మీర్ లో తీశారు.యుటీవీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకుడు

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.