Read more!

English | Telugu

రణ్ వీర్, దీపిక..వాలెంటైన్స్ డే రోజు రాత్రి..?

బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ దీపిక త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారా..? అవునంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ఒళ్లు తెలియనంత పీకల్లోతు ప్రేమల్లో వీళ్లిద్దరూ మునిగితేలుతున్నారు. ఒకర్ని విడిచి మరొకరు దూరంగా ఉండలేనంతగా అతుక్కుపోయారు. దీపిక తన హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం టోరంటో వెళ్తే, ఆమెను వదిలి ఉండలేక ఆ వెనకాలే రణ్ వీర్ కూడా వెళ్లి టోరంటోలో వాలిపోయాడు.

ప్రేమికుల రోజున ఇద్దరూ కలిసి కాస్త ప్రైవసీతో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిన తర్వాత, తనను పెళ్లి చేసుకోమని ఆమెకు రణ్ వీర్ ప్రపోజ్ చేయబోతున్నాడట. ఇప్పటికే రణ్ బీర్ తో బ్రేకప్ అయిన దీపిక, ఈసారి మాత్రం రాంగ్ స్టెప్ వేయకుండా పెళ్లికి ఒప్పేసుకుంటుందా..లేక మరి కొంత కాలం ఆగుదామంటుందా..అసలే అది బాలీవుడ్..ఎప్పటికప్పుడు హీరోల టేస్ట్ లు, లవ్ ఇంట్రస్ట్ లు మారిపోతుంటాయి. లేట్ చేస్తే రణ్ వీర్ కూడా దూరమయ్యే అవకాశం లేకపోలేదు. మరి దీపిక ఏం చేస్తుందో చూడాలి...