Read more!

English | Telugu

రామ్ చరణ్ రిలీజ్ చేస్తున్నాడు..

తమిళ్ లో ఇప్పటి వరకూ రాని జాంబీ ( నడుస్తున్న శవాలు ) కాన్సెప్ట్ తో తెరకెక్కిన ' మిరుతన్ ' సినిమా తెలుగులో ' యమపాశం ' పేరుతో రాబోతోంది. జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం తమిళుల నోట నానుతోంది. సరికొత్త జాంబీ జానర్ లో కథాంశాన్ని తెరకెక్కించడమే అందుక్కారణం..వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తెలుగు ఆడియోను రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నారు.

శక్తి సౌందర్ రాజన్ తీసిన ఈ జాంబీ మూవీ, ఈ జానర్ లో ఇండియాలోనే రెండోది కావడం విశేషం. మొదటిది గో గోవా గాన్ పేరుతో సైఫ్ అలీఖాన్ హీరోగా వచ్చింది. రాక్ ది షాదీ పేరుతో మరో జాంబీ సినిమా తెరకెక్కినా రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో మాత్రమే ఈ తరహా చిత్రాలు వచ్చేవి. ఒక వైరస్ ప్రపంచమంతా వ్యాపించి, మనుషుల్ని నరమాంస భక్షకులుగా మార్చేస్తే, ఆ వైరస్ నుంచి మిగిలిన వాళ్లను కాపాడటమెలా అనేదే జాంబీ కథాంశం. హాలీవుడ్ వాళ్లకు ఇవి రొటీన్ అయిపోయినా, ఇండియాకు మాత్రం ఇవి కొత్తే..ఈ బైలింగ్వల్ మూవీ, సౌత్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.