Read more!

English | Telugu

నిర్మలా కాన్వెంట్ లో ఎ ఆర్ రెహమాన్ తనయుడు

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ కింగ్ నాగార్జున నిర్మిస్తున్న సినిమా నిర్మలా కాన్వెంట్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ సినిమాలో ఎ ఆర్ రెహమాన్ తనయుడు ఎ ఆర్ అమీన్ తో పాట పాడించారట. అమీన్ ఇప్పటికే ఓకే కన్మణిలో ఒక సూఫీ గీతం పాడాడు. ఆ పాటకు అంతటా ప్రశంసలు లభించాయి. తాజాగా కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీత దర్శకత్వంలో నిర్మలా కాన్వెంట్ లో పాడిన ఈ పాట అద్భుతంగా రావడంతో మూవీ టీం చాలా ఆనందంగా ఉన్నారు.

తండ్రిలాగే ఎ.ఆర్.అమీన్ కు కూడా సంగీతమంటే చాలా ఇష్టం. ఫ్యూచర్లో తను కూడా సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను ఎంచుకునే అవకాశం ఉందట. నిర్మలా కాన్వెంట్ సినిమా విషయానికొస్తే, నాగార్జున ఫిల్మ్ స్కూల్ AISFMలోనే ఫిల్మ్ కోర్స్ చేసిన జి. నాగకోటేశ్వరావు దర్శకత్వంలో, అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. సినిమాలో ఆయన కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తుండటం విశేషం.