Read more!

English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ లో మరింత పెరగనున్న డోస్


 

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ కు సీక్వెల్ కావడంతో, సర్దార్ పై ఆల్ టైం హయ్యెస్ట్ ఎక్ప్ పెక్టేషన్స్ ఉన్నాయి.గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి సీన్ ఎంత హిట్టయిందో తెలిసిందే. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ లో దాన్ని మించిన కామెడీ డోస్ పడబోతోందట. ప్రస్తుతం ఈ కామెడీ సీన్స్ మీదే షూటింగ్ జరుగుతోంది. దాదాపు జబర్దస్ట్ కమెడియన్స్ అందరూ కూడా కానిస్టేబుల్స్ గా పవన్ తో కలిసి కితకితలు పెట్టబోతున్నారు.

సినిమా విషయానికి వస్తే, అంచనాలను అందుకునేందుకు యూనిట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. రెండు సెపరేట్ యూనిట్లలో షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఏప్రిల్ 8 న ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనేది పవన్ ప్లాన్. ఇటీవలే సర్దార్ కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే..