ఆ సినిమాకు వేసే సెట్ 20 కోట్లు..!!
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారీ చిత్రాల దర్శకుడు ఎన్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా రోబో 2. 2010లో రిలీజై ఇండియాలో సెన్సేషన్ సృష్టించిన రోబోకు ఇది సీక్వెల్. అంతర్జాతీయంగా కూడా ఈ సినిమా చాలా పేరు సంపాదించుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహమో, లేక తన మీద తనకున్న నమ్మకమో గానీ, స్టార్ డైరెక్టర్ శంకర్, రోబో 2 కు అన్నీ భారీగానే ప్లాన్ చేస్తున్నాడు.