English | Telugu

కళ్యాణ్ తో చిరు కూతురి వివాహం!


చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ వివాహం చిత్తూరుకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కిషన్‌గారి కుమారుడితో దాదాపుగా నిశ్చయం అయిన విషయం తెలిసిందే! వరుడు కళ్యాణ్‌, ఒకప్పుడు శ్రీజ క్లాస్‌మేటే అని తెలుస్తోంది. చిరంజీవి, కిషన్‌ ఇద్దరి కుటుంబాల మధ్యా ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయనీ, ఈ పరిచయాలే ప్రస్తుత పరిణయానికి దారి తీశాయనీ అంటున్నారు. తన జీవితం గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి కళ్యాణ్‌ని చేసుకునేందుకు శ్రీజ సుముఖత వ్యక్తి చేశారట. శిరీష్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తితో శ్రీజ చేసుకున్న మొదటి వివాహం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే! ఛేజింగ్‌లు, డైలాగుల మధ్య ఎంతో ఆర్భాటంగా ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే, అత్తవారింట తనకి బాధలు పెడుతున్నారంటూ శ్రీజ, పుట్టింటికి చేరుకుంది. శ్రీజకి మళ్లీ ఒక కొత్త జీవితాన్ని అందించే క్రమంలో, కళ్యాణ్‌ ఆమెకు తగినవాడు అని చిరంజీవికి నమ్మకం కుదరడంతో ఈ పెళ్లి నిశ్చయమైంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.