Read more!

English | Telugu

త్రివిక్రమ్ రిలీజ్ చేసిన జయమ్ము నిశ్చయమ్మురా..

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిన్న చిన్న పాత్రలతోనే, కెరీర్ ను మలుచుకుని గీతాంజలి సినిమాతో హీరోగా కూడా మారాడు శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా ఇప్పుడున్న హాస్యనటుల్లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడి పేరు చెప్పమంటే శ్రీనివాసరెడ్డి పేరు తప్పకుండా గుర్తొస్తుంది. కమెడియన్ గా స్టార్ స్టేటస్ కు చేరకపోయినా, పూర్తి స్థాయి హీరో వేషాలు మాత్రం సంపాదించుకోగలుగుతున్నాడు శ్రీనివాసరెడ్డి.

తాజాగా శ్రీనివాసరెడ్డి హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా జయమ్ము నిశ్చయమ్మురా..కరీంనగర్ నుంచి కాకినాడ వరకూ ప్రయాణం చేసిన ఒక జంట మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు, సొంతంగా నిర్మిస్తూ తీస్తున్న ఈ సినిమా వీడియో పోస్టర్ ను త్రివిక్రమ్, నితిన్ కలిసి విడుదల చేశారు. పోస్టర్ వైవిధ్యంగా, కథ ఎలా ఉండబోతోందో సూచించే విధంగా ఉంది. మరి శ్రీనివాస్ రెడ్డి, హీరోగా మరో సక్సెస్ కొడతాడో లేదో చూడాలి..