Read more!

English | Telugu

సల్మాన్ అనుష్క కొత్త పోస్టర్

సల్మాన్ ఖాన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సుల్తాన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. వాలెంటైన్స్ డే కానుకగా, సల్మాన్, అనుష్క శర్మ కలిసి ఉన్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ' సుల్తాన్ ' క్రీడా నేపథ్యం ఉన్న సినిమా..దీనితో పాటు సినిమాలో అందమైన ప్రేమకథ కూడా ఉండబోతోందని సమాచారం.

హర్యానాలో అద్భుతమైన బాక్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుల్తాన్, మొత్తం హర్యానాలో అత్యంత అందమైన అమ్మాయితో ప్రేమలో ఎలా పడతాడు అన్నది సినిమాలో ఆసక్తికర అంశం. ఈ వేసవిలో రిలీజ్ కానున్న' సుల్తాన్ ' ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ కు మకుటం లేని మెగాస్టార్ గా వెలుగుతున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమా ద్వారా మరిన్ని రికార్డులు నెలకొల్పడానికి సల్మాన్ రెడీ అవుతున్నాడు.