English | Telugu

ఈతరం జంట : నమ్రత మహేష్


ఈతరం జంట : నమ్రతా మహేష్


వాలంటైన్స్ డే కౌంట్ డౌన్ లో ఈ రోజు మనం చూడబోయే సూపర్ కపుల్ మహేష్ బాబు, నమ్రత..



అలా మొదలైంది :
1998లో బాలీవుడ్ లో జబ్ ప్యార్ కిస్సే హోతా హై అనే సినిమాలో చిన్న పాత్రలో కెరీర్ మొదలుపెట్టి, ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేసిన నమ్రత, టాలీవుడ్లో మహేష్ బాబుతో వంశీ, చిరంజీవితో అంజి చేసింది. వంశీ చేస్తున్న టైం లో నమ్రతకు మహేష్ కు మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికి అది స్నేహంగానే ఉన్నా, తర్వాత మరోసారి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుకున్నప్పుడు ఇద్దరి టేస్ట్ లు ఒకటే అని అర్ధమైంది. అక్కడ నుంచి వాళ్ల స్నేహం బలపడింది.


నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత స్నేహం ప్రేమగా మారింది. అలా ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత, ఫిబ్రవరి 10, 2005 న ఇద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. మహేష్, నమ్రత ఇద్దరూ సింప్లిసిటీని ఇష్టపడే వాళ్లే కావడంతో, పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా పెళ్లైపోయింది. పెళ్లైన తర్వాత ఘట్టమనేని వారి ఇంటి కోడలిగా ఒద్దికగా అమరిపోయింది నమ్రతా మహేష్..

ఒకరిపై ఒకరి మాట :

హిట్ వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఫ్లాప్ వచ్చినప్పుడు కుంగిపోకుండా నమ్రత తనను బ్యాలెన్స్ చేస్తారనేది మహేష్ మాట. ఈ మధ్యే అయిన వాళ్లను కోల్పోయిన సమయంలో తనకు మహేష్ ఎంతో మానసిక స్థైర్యాన్నిచ్చారని,మహేష్ లాంటి భర్త దొరకడం అదృష్టం అనేది నమ్రత వినమ్రంగా చెప్పే మాట.



ఒకరికి ఒకరు :


పెళ్లవక ముందు మహేష్ కు సిగరెట్స్ అడిక్షన్ ఉండేది. కానీ పెళ్లైన తర్వాత అలవాట్లన్నీ మానేశాడు. ప్రేమ చేసే మ్యాజిక్ అదే. ప్రస్తుతం ఈ సెలబ్ కపుల్ కు గౌతమ్ బాబు, సితార అనే ఇద్దరు పిల్లలు. గౌతమ్ ఇప్పటికే నేనొక్కడినే సినిమాలో చిన్న పాత్రలో మెరిశాడు. షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్లి నమ్రత, పిల్లలతో గడపడమే మహేష్ కు ఇష్టం. మహేష్ కు ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకుని అలా మసలుకోవడం నమ్రతకు ఇష్టం. బయటి ప్రపంచానికే మహేష్ సూపర్ స్టార్. ఇంటికి చేరుకుంటే అవన్నీ బయటే వదిలేస్తాడు. తను కూడా ఒక తండ్రి, ఒక భర్త అంతే. ఆ సింప్లిసిటీయే నమ్రతకు కూడా ఇష్టం. ప్రతీ ఏడాది, తన షూటింగ్ లేని టైంలో కుటుంబం మొత్తాన్ని ఏదో ఒక డెస్టినేషన్ కు తీసుకెళ్తాడు మహేష్. ఎంత బిజీలో ఉన్నా కుటుంబాన్ని నెగ్లక్ట్ చేయకపోవడం మహేష్ లోని మరో మంచి లక్షణం.


మ్యారేజ్ తర్వాత మహేష్ స్టైలింగ్ మొత్తం నమ్రతే చూసుకున్నారు. వివాహం తర్వాత మహేష్ మొదటి సినిమా అతడు. సూపర్ డూపర్ హిట్ అయి మహేష్ కెరీర్ లోనే మర్చిపోలేని సినిమా అయింది. ఆ తర్వాత వచ్చిన పోకిరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో కూడా తెలిసిందే..అందుకే మహేష్ నమ్రతను తన లక్కీ లేడీగా భావిస్తాడు. ప్రతీ భర్త, తన భార్య తనకు లక్కీ అని భావిస్తే, ఇక ఆ బంధంలో ఎలాంటి కలతలు ఉండవు. అందుకే మహేష్ నమ్రతలు ఒకరికి ఒకరుగా, ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నారు.. ఒకరికి ఒకరుగా కలిసి మెలసి జీవిస్తే ఎలాంటి స్పర్థలు, ఇగోలు బంధానికి అడ్డురావు. అలాంటి వివాహ బంధం కలకాలం నిలిచేఉంటుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .