Read more!

English | Telugu

సీటుబెల్టు పెట్టుకోవడం వల్లే ప్రణీత సురక్షితం


 

కార్లలో ఉండేవారు సీటు బెల్టు పెట్టుకోవడం ఎంత అవసరమో మరోసారి తెలిసివచ్చింది. అత్తారింటి దారేది ఫేం ప్రణీత నిన్న హైదరాబాదుకి వస్తుండగా ఆమె కారు బోల్తా పడిన విషయం తెలిసిందే! ఆ సమయంలో ప్రణీత ఆమె తల్లి కూడా ఉన్నారు. ఖమ్మంలోని ఒక షాపింగ్‌ మాల్‌ని ప్రారంభించిన వస్తుండగా ప్రణీత వాహనం ఎదురుగా ఒక ద్విచక్ర వాహనం ఎదురువచ్చింది. దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవరు సడెన్‌ బ్రేకు వేయడంతో... కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సందర్భాలలో తలకి తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉండగా, సీటు బెల్టుని ధరించడం వల్ల ప్రణీత సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కి జరిగిన ప్రమాదం కూడా ఇదే రహదారి మీద జరగడం గమనార్హం.