Read more!

English | Telugu

త్వరలోనే సరైనోడు టీజర్

రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ఊపు మీదున్న కెరీర్ కు సరైనోడుతో హ్యాట్రిక్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. సింహా, లెజండ్ లాంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బన్నీ అభిమానులకు వేసవి సెలవుల కానుకగా సరైనోడు రాబోతోంది.

ఈ మధ్యే రిలీజైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాస్స్ రావడంతో, అదే స్పీడ్ లో టీజర్ ను కూడా రిలీజ్ చేసే పనిలో పడ్డారు సరైనోడు టీం. ఇప్పటికే బోయపాటి టీజర్ కట్ చేయడం కోసం ప్రత్యేకంగా టైం కేటాయించినట్లు సమాచారం. ఈ వారంలోనే టీజర్ ను కట్ చేసి, వచ్చేవారంలో సరైనోడు రిలీజ్ చేయబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ నిర్మిస్తున్న సరైనోడులో బన్నీ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్ నటిస్తున్నారు..