English | Telugu

బన్నీ మీద దిల్ రాజు ప్రతీకారమా..?

దిల్ రాజు అంటే సక్సెస్ కు మారుపేరు. చిన్న మెకానిక్ షెడ్ స్థాయి నుంచి డిస్ట్రిబ్యూటర్ గా ఆ తర్వాత ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ది పిల్లర్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ప్రతీ రూపాయి ఆచి తూచి ఖర్చుపెడతాడని కూడా దిల్ రాజుకు పేరు. మరి అలాంటి దిల్ రాజు, కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ పై కృష్ణాష్టమి కోసం ఎందుకింత భారీ బడ్జెట్ పెట్టాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమాలో కేవలం సునీల్ బట్టలకే 20 లక్షల వరకూ పెట్టారట. పోనీ సునీల్ కు భీభత్సమైన హిట్లేవన్నా వచ్చాయా అంటే అదీ లేదు. మర్యాద రామన్న ఓ మాదిరిగా ఆడింది తప్ప, నిజం చెప్పాలంటే సునీల్ హీరో కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. మరి దిల్ రాజు ప్లాన్ ఏంటి..?

ఆడియో ఫంక్షన్లో స్వయంగా సునీలే చెప్పాడు. దిల్ రాజు తన కొడుకును హీరోగా పెట్టి తీస్తే ఎంత ఖర్చు పెడతారో, అలా ఖర్చు చేశాడు అని. నిజానికి దిల్ రాజుకు కోపం పౌరుషం చాలా ఎక్కువే..అందుకే ప్రొడ్యూసర్ గా ఫ్లాప్ లు వచ్చినా, హిట్టు కోసం మరో భారీ సినిమాయే తీస్తాడు. కృష్ణాష్టమి కథ మొదటి అల్లు అర్జున్ కోసం ప్రిపేర్ చేయించాడు దిల్ రాజు. కానీ బన్నీకి ఆ కథ నచ్చలేదు. కొన్ని ఛేంజెస్ చేయించి వినిపించినా, బన్నీ వద్నన్నాడట.. దీంతో అల్లు అర్జున్ కాదన్న ఇదే కథను సునీల్ తో తీసి హిట్టు కొడదామని దిల్ రాజు ఫిక్సయాడనేది సమాచారం. ఒక రకంగా బన్నీపై ప్రతీకారానికే కృష్ణాష్టమిని అంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని నిర్మించాడట. సునీల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ గా తెరకెక్కిన కృష్ణాష్టమి ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది. వాసువర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సునీల్ సరసన డింపుల్ చోపడే, నిక్కీ గల్రానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .