English | Telugu

ప‌వ‌న్ దెబ్బ‌కు ఆ ద‌ర్శ‌కుడు బెంబేలు


స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి ద‌ర్శ‌కుడెవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఈ సినిమాకి `పేరు`కి ద‌ర్శ‌కుడు బాబి అయినా.. వెన‌కుండి అంతా న‌డిపిస్తోంది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌ది ఉన్న‌మాటే. త‌న ప్ర‌తి సినిమా విష‌యంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ జోక్యం చేసుకొంటాడ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ స‌ర్దార్ విష‌యంలో మాత్రం ఈ జోక్యం మితిమీరిపోయింద‌ని టాక్‌. ద‌ర్శ‌కుడు బాబికి కేవ‌లం మోనేట‌ర్‌కే ప‌రిమితం చేసిన ప‌వ‌న్‌... షాట్ కంపోజీష‌న్‌కూడా తానే ద‌గ్గ‌రుండి చూసుకొంటున్నాడ‌ట‌. న‌టీన‌టుల‌కు డైలాగ్ ఎలా ప‌ల‌కాలో కూడా ప‌వ‌నే చెబుతుండ‌డం చూసి.. మిగిలిన‌వాళ్లంతా షాకైపోతున్నార‌ట‌. అంతే కాదు.. ఈ సినిమా టైటిల్ కార్డులో `ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌` అనే కార్డు ప‌వ‌న్ పేరుమీదే ప‌డ‌బోతోంద‌న్న‌ది అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి క‌థ అందించిన ప‌వ‌న్‌.. స్ర్కీన్ ప్లే కూడా త‌నే స‌మ‌కూర్చాడ‌ని, ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా త‌న పేరు మీదే వేసుకొంటున్నాడ‌ని, ఇక బాబికి ఉత్తుత్తి ద‌ర్శ‌కుడిగా ముద్ర ప‌డ‌బోతోంద‌ని ఫిల్మ్‌న‌గర్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి.

అన‌వ‌స‌రంగా ఈ సినిమా ఒప్పుకొన్నానేమో..?? అనే బాధ బాబికి రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంద‌ని అత‌ని స‌న్నిహితులు చెప్పుకొంటున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యంలో నూ ప‌వ‌న్ విప‌రీతంగా జోక్యం చేసుకొన్నా.. క్రెడిట్ మాత్రం హ‌రీష్ శంక‌ర్‌కి ద‌క్కింది. ఈ సినిమా విష‌యంలో బాబికి మాత్రం మొండి చేయే మిగిలే ఛాన్సుంది. సినిమా పోతే... ప‌వ‌న్‌కి బాబి స‌రిగా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు అంటారు... ఒక‌వేళ హిట్ అయితే.. ప‌వ‌న్ మ్యాజిక్ ప‌నిచేసింద‌ని చెప్పుకొంటారు. అలాంట‌ప్పుడు ఈ సినిమాతో బాబికి న‌ష్ట‌మే త‌ప్ప ప్ర‌యోజ‌నం ఉండ‌దు. బాబి భ‌య‌ప‌డేదీ అందుకోస‌మే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.