Read more!

English | Telugu

అల్లు వారింట పెళ్లా..?

త్వరలోనే శ్రీమస్తు శుభమస్తు..మీ ఆశీస్సులు కావాలి. మిగిలిన వివరాలు త్వరలో పోస్ట్ చేస్తాను. ఇదీ అల్లు శిరీష్ ట్వీట్. ఇప్పుడు దీనిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అల్లు వారింట పెళ్లి సందడా..లేక శిరిష్ చేయబోయే కొత్త సినిమానా..?  పెళ్లే అనుకుందామంటే, అప్పుడు శ్రీరస్తు శుభమస్తు అనాలి కానీ శ్రీమస్తు అని ఎందుకన్నాడు..? అన్నయ్యకు ఇప్పటికే పెళ్లి బాజాలు మోగిపోయాయి. ఇక తర్వాత మోగాల్సింది తన పెళ్లికే..కాబట్టి శిరీష్ కు పెళ్లి సెట్టయిందనుకోవచ్చా..? ఇవీ నెటిజన్ల ప్రశ్నలు. శిరీష్ మరో ట్వీట్ చేసేవరకూ ఈ ప్రశ్నలకు జవాబు దొరికేట్టు కనబడట్లేదు. మరి ఈ మిస్టరీని శిరీష్ ఎప్పుడు సాల్వ్ చేస్తాడో...