English | Telugu

ఛీ.. తాప్సి చీర లాగేశాడు


షాపింగ్ మాల్‌లో సంద‌డి చేయమంటే క‌థానాయిక‌ల‌కు ఎంతిష్ట‌మో..? అడ‌గ్గానే వాలిపోతుంటారు. డ‌బ్బులు బాగా గిట్టుబాటు అవుతాయి, దానికి తోడు ఫ్రీ ప‌బ్లిసిటీ. సినిమాల్లేక‌పోయినా.. నెల‌కు ఇలాంటి బేరాలు నాలుగైదు త‌గిలితే చాలు అనుకొంటారు. అయితే... అలాంటి చోట అల్ల‌రి మూక‌ల్ని అదుపులో పెట్ట‌డం మాత్రం.. ఎవ్వ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌లో కొంత‌మంది ఆక‌తాయిలు క‌థానాయిక‌ల్ని నానా హైరానాకు గురిచేస్తున్నారు. ఎందుకొచ్చాంరా బాబూ.. అంటూ హీరోయిన్లు ఫీల్ కావాల్సి వ‌స్తోంది. తాజాగా తాప్సీకి ఇలాంటి చేదు అనుభ‌వం ఒక‌టి ఎదురైంది. చెన్నై లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభ‌వోత్స‌వానికి హాజ‌రైంది తాప్సీ. గంట‌న్న‌ర పాటు అక్క‌డ సంద‌డి చేయడానికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఆఫ‌ర్ ఇచ్చారు. డ‌బ్బులిస్తున్నారు క‌దా అని... తాప్సి సంతోషంగా వెళ్లింది. తీరా అక్క‌డ‌కు వెళ్లేస‌రికి... అబిమానులు గుమ్మిగూడిపోయారు. వాళ్లని ఆప‌డం సిబ్బందివ‌ల్ల కాలేదు.

తాప్సీ చుట్టూ కొంత‌మంది ఆత‌కాయి అబిమానులు చేరిపోయారు. అందులో ఒక‌డు ఆమె చీరను గట్టిగా లాగాడు, దాంతో తాప్సి షాక్ కి గురైంది. తేరుకొనే లోగా.. చుట్టూ ఉన్న‌వాళ్ల మ‌ధ్య న‌లిగిపోయింది. బాక్స‌ర్లు వ‌చ్చి.. తాప్సిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేంత వ‌ర‌ర‌కూ తాప్సికి ఊపిరి ఆడ‌లేదు. బ‌య‌ట‌కొచ్చిన తాప్సి... అక్క‌డి సిబ్బందితో గొడ‌వ ప‌డి మ‌రీ.. విసురుగా వ‌చ్చేసింది. ఈ విష‌య‌మై... షాపింగ్ మాల్ యాజ‌మాన్యం తాప్పికి క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది. ఇలా... జ‌నం మ‌ధ్య‌కు వెళ్లిన‌ప్పుడు క‌థానాయిక‌లు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల్సిందే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.