English | Telugu

రజనీకాంత్ భయపడ్డాడా..?

అవును. రజనీకాంత్ కూడా భయపడ్డాడు. కబాలీ రిలీజ్ ను వాయిదా వేయమని ప్రొడ్యూసర్ కు చెప్పాడు. ఇంతకూ రజనీని అంతగా భయపెట్టింది ఏమయ్యుంటుంది అనుకుంటున్నారా..? రజనీకి వేరే సినిమాల రిలీజ్ ల గురించి భయం లేదు. కానీ త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి ప్రభావం తన సినిమా మీద ఉండకూడదనే, కబాలీ రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచన పెట్టుకున్నాడు రజనీ. రంజిత్ డైరెక్షన్లో మాఫియా డాన్ గా రజనీకాంత్ నటిస్తున్న సినిమా కబాలీ. తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజవ్వబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం మలేషియాలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

కబాలీ షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. దాంతో ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఎలక్షన్లు ఉండటంతో, వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయానికి రజనీ వచ్చినట్లు సమాచారం. తమిళనాడులో రాజకీయాలు సినిమాలకు ఏ మాత్రం తీసిపోవు. ఆ టైం లో రిలీజ్ చేస్తే, ఎంతటి గొప్ప సినిమా అయినా, దెబ్బై పోయే అవకాశాలే ఎక్కువ. అందుకే రిస్క్ ఎందుకులే అని రజనీ భావిస్తున్నాడట. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. దీని బట్టి చూస్తే, రజనీ అభిమానులు ఆయన సినిమా కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదేమో...

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.