Read more!

English | Telugu

ఆ సినిమాకు వేసే సెట్ 20 కోట్లు..!!

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారీ చిత్రాల దర్శకుడు ఎన్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా రోబో 2. 2010లో రిలీజై ఇండియాలో సెన్సేషన్ సృష్టించిన రోబోకు ఇది సీక్వెల్. అంతర్జాతీయంగా కూడా ఈ సినిమా చాలా పేరు సంపాదించుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహమో, లేక తన మీద తనకున్న నమ్మకమో గానీ, స్టార్ డైరెక్టర్ శంకర్, రోబో 2 కు అన్నీ భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో కీలక డిపార్ట్ మెంట్స్ అన్నింటిలోనూ హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

లేటెస్ట్ గా సినిమాకు చాలా కీలకమైన ఒక భారీ సెట్ ను చెన్నై శివార్లలో నిర్మిస్తున్నారు. కేవలం ఈ ఒక్క సెట్ కే 20 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. రజనీకాంత్ కు, విలన్ గా చేస్తున్న అక్షయ్ కుమార్ కు మధ్య వచ్చే పతాక సన్నివేశాలన్నీ ఇక్కడే తెరకెక్కుతాయి. అందుకే సినిమాకు అంత కీలకమైన ఈ సెట్ కోసం రాజీ పడకుండా, భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడు శంకర్. తన ముందు సినిమా, ' ఐ ' లో ఒక పాట కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సెట్ వేయించాడు. తన సినిమా అనుకున్నట్లుగా రావడం కోసం ఎంత ఖర్చయినా చేస్తాడు శంకర్..400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రోబో 2, 2017 చివర్లో రిలీజ్ కానుంది..